Kiran: నాలుగైదు రోజులగా దానంతట అదే బోరు నుండి ఉబికి వస్తున్న నీరు

Kiran Water springs miraculously from abandoned borewell in Warangal
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో వింత ఘటన
  • 15 ఏళ్ల క్రితం వేసిన బోరు నుండి ఉబికి నీరు
  • నీరు రాలేదని అప్పుడు వదిలేసిన బోరు నుండి ఇప్పుడు ఉబికి వస్తున్న గంగమ్మ
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలో ఒక బోరు నుండి స్వయంగా నీరు బయటకు వస్తోంది. 15 సంవత్సరాల క్రితం వేసిన ఈ బోరు నుండి నాలుగైదు రోజులుగా నీరు ఉబికి వస్తోంది. ఈ వింత ఘటన మండలంలోని కట్య్రాలలో చోటు చేసుకుంది. నిరుపయోగంగా ఉన్న బోరు నుంచి నీరు రావడం చూసిన స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ నీరు వస్తున్న బోరు కిరణ్ అనే రైతు పొలంలో ఉంది. ఆయన మాట్లాడుతూ, తనకున్న ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్ల లోతున బోరు వేయగా నీరు సరిగా రాకపోవడంతో వదిలేశామని కిరణ్ చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత బోరు నుంచి నీరు ధారాళంగా ఉబికి రావడం గంగమ్మ తల్లి చలువేనని రైతు కిరణ్ ఆనందం వ్యక్తం చేశారు. మోటారు లేకుండానే నీరు ఉబికి వస్తోందని, ఇది తన సాగుకు ఉపయోగపడుతోందని అన్నారు.
Kiran
Kiran farmer
Wardhannapet
Warangal district
groundwater
borewell
miracle
water source
Katyryala

More Telugu News