Guntur Train Rape: రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. గుంటూరులో దారుణం

Guntur Train Rape Woman Raped at Knifepoint on Train
  • బోగీలో ఒంటరిగా ఉన్న తనను కత్తితో బెదిరించి రేప్ చేశాడని వెల్లడి
  • గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య ఘటన
  • చర్లపల్లి చేరుకున్నాక రైల్వే పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బోగీలో బాధితురాలు తప్ప ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న దుండగుడు.. కత్తితో బెదిరించి అత్యాచారం చేయడంతో పాటు బాధితురాలి డబ్బు, నగలు ఎత్తుకెళ్లాడు. ఏపీలోని రాజమహేంద్రవరం సంత్రగచి స్పెషల్ ట్రైన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్లపల్లి వెళ్లేందుకు బాధిత మహిళ రాజమహేంద్రవరంలో సంత్రగచి స్పెషల్ ఎక్కింది.

రైలు గుంటూరు దాటిన తర్వాత ఆ బోగీలో తను తప్ప ఎవరూ లేరని, ఇంతలోనే 40 సంవత్సరాల వయస్సున్న దుండగుడు బోగీలోకి వచ్చాడని తెలిపింది. తాను ఒంటరిగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు.. కత్తితో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని తెలిపింది. రైలు గుంటూరు, పెద్దకూరపాడు మధ్య ప్రయాణిస్తుండగా ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పింది. అనంతరం, తన హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ లాక్కుని పెద్దకూరపాడు స్టేషన్ లో రైలు ఆగగానే దిగిపోయాడని తెలిపింది. చర్లపల్లికి చేరుకున్నాక బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
Guntur Train Rape
Andhra Pradesh Crime
Train Assault
Rajahmundry
Pedakurapadu
Sexual Assault India
Crime News Telugu
Railway Police
Special Train

More Telugu News