Ravi Teja: ఆడకపోయినా ఆ మూడు సినిమాలంటేనే ఇష్టం: రవితేజ 

Raviteja Interview
  • రవితేజ తాజా చిత్రంగా 'మాస్ జాతర'
  • ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల 
  • ఆరంభంలో ఎవరూ వేషాలు ఇవ్వలేదన్న రవితేజ
  • తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువని వెల్లడి
రవితేజ .. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి, అంచలంచెలుగా ఎదిగిన హీరో. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న స్టార్. అలాంటి రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మాస్ జాతర' సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ జోడీగా శ్రీలీలే సందడి చేయనుంది. 'ధమాకా' బ్లాక్ మాస్టర్ తరువాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. 

ఈ ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నారు. " నేను యాక్టింగ్ వైపు చేసిన ప్రయాత్నాలు ఫలించలేదు. అర్హత లేని వాళ్లకి సిఫార్సులతో వేషాలు వెళ్లడం చూశాను. ఇలా అయితే కష్టమేనని అనుకుని, డైరెక్షన్ వైపు వెళ్లాను. హీరోను కావాలని ఎప్పుడూ అనుకోలేదు గానీ, ఎప్పటికైనా నటుడిగా మంచి గుర్తింపు పొందుతాననే నమ్మకం బలంగా ఉండేది" అని అన్నారు.  

" నేను చేసిన పాత్రలలో 'ఈగల్' సినిమాలోని పాత్ర నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కాస్త తేలికపాటు స్క్రీన్ ప్లేతో చెప్పి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఫీల్ ఉన్న ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే ఆ తరువాత కాలంలో క్లాసిక్ గా మార్కులు కొట్టేసింది. 'నేనింతే' సినిమా కూడా చాలా బాగుంటుంది. కానీ అది కూడా ఆడలేదు. ఆడకపోయినా నా ఫేవరేట్ సినిమాల జాబితాలో ఈ మూడూ ఉంటాయి" అని చెప్పారు. 

Ravi Teja
Eagle movie
Naa Autograph Sweet Memories
Neninthe movie
Sreeleela
Mass Jathara movie
Telugu cinema
Telugu movies
Bhanu Bogavarapu
Tollywood

More Telugu News