RO-KO: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

BCCI Breaks Silence On If India vs Australia ODI Series Is Virat Kohli Rohit Sharmas Last
  • రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు తెర
  • వదంతులను కొట్టిపారేసిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా
  • ఆస్ట్రేలియా సిరీసే వారికి చివరిది కాదని స్పష్టీక‌ర‌ణ‌
  • రిటైర్మెంట్‌పై నిర్ణయం పూర్తిగా ఆటగాళ్లదేనని వెల్లడి
  • ఆస్ట్రేలియాపై గెలుస్తామని ధీమా
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెరదించారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీసే వీరిద్దరికీ చివరిది కావొచ్చంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది ఆటగాళ్లేనని, దానిపై ఇతరులు మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కు రోహిత్, కోహ్లీ జట్టులో ఉండటం మాకు ఎంతో ప్రయోజనకరం. వారిద్దరూ గొప్ప బ్యాటర్లు. వారి అనుభవం ఆస్ట్రేలియాను ఓడించడంలో మాకు కచ్చితంగా సహాయపడుతుంది. ఇదే వారి చివరి సిరీస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆటగాళ్లు ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ఇదే వారి చివరి సిరీస్ అనడం పూర్తిగా తప్పు" అని ఆయన తెలిపారు.

2027 ప్రపంచకప్ నాటికి రోహిత్‌కు 40, కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. మరోవైపు గిల్ కెప్టెన్‌గా రాణించడం, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో సీనియర్ల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20ల నుంచి వైదొలగి కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టును రాజీవ్ శుక్లా అభినందించారు. "ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ విజయం చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాలో పోటీ ఎప్పుడూ తీవ్రంగా ఉంటుంది. ఈ విజయం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆస్ట్రేలియాలోనూ మనం తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం నాకుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
RO-KO
Rohit Sharma
Virat Kohli
BCCI
Rajeev Shukla
India vs Australia
Retirement
Shubman Gill
Indian Cricket Team
Cricket
ODI Series

More Telugu News