తిరుమల పరకామణి కేసు... ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సీఐడీ
- తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి చోరీ కేసులో రికార్డులను సీజ్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు
- సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన వైనం
- త్వరలో సీజ్ చేసిన రికార్డులను హైకోర్టుకు అందజేస్తామన్న సీఐడీ డీజీ అయ్యన్నార్
2023 మార్చిలో తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో టీటీడీ ఉద్యోగి రవికుమార్ ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు. అయితే, ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ జరపలేదని ఆరోపణలు వచ్చాయి. అనంతరం, లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకొని కేసును మూసివేశారనే ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిజానిజాలు వెలికి తీయాలని ఆదేశించింది.
దీంతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిన్న విచారణ జరిపింది.