Huma Qureshi: ఓటీటీ తెరపైకి పొలిటికల్ థ్రిల్లర్!

Maharani 4 Update
  • 'మహారాణి'గా హ్యుమా ఖురేషి 
  • పొలిటికల్ థ్రిల్లర్ జోనర్
  • రెడీ అవుతున్న సీజన్ 4
  • నవంబర్ 7 నుంచి అందుబాటులోకి

 థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఏ భాష నుంచి వస్తున్నా, ప్రేక్షకుల నుంచి ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ మాదిరిగా పొలిటికల్ థ్రిల్లర్ కి సంబంధించిన కథలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందువలన ఈ తరహా సిరీస్ లు ఎప్పటికప్పుడు తమ భారీతనాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. ఆ వరుసలోని వెబ్ సిరీస్ గా 'మహారాణి' కనిపిస్తుంది. 

హ్యూమా ఖురేషి ప్రధానమైన పాత్రను పోషించిన 'మహారాణి' సిరీస్, 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. ఒక సాధారణ గృహిణి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరును గురించి ఈ కథ కొనసాగుతుంది. ఇంతవరకూ వచ్చిన మూడు సీజన్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులను పలకరించడానికి 4వ సీజన్ రెడీ అవుతోంది. నవంబర్ 7వ తేదీ నుంచి సీజన్ 4 అందుబాటులోకి రానుంది. 

ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతవరకూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చిన మహారాణి, ఇకపై ప్రధానమంత్రి పీఠం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టుగా ట్రైలర్ ను వదిలారు. శ్వేతా బసు ప్రసాద్ .. విపిన్ శర్మ .. అమిత్ సియాల్ .. వినీత్ కుమార్ .. శార్దూల్ భరద్వాజ్ .. ప్రమోద్ పాఠక్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

Huma Qureshi
Maharani Season 4
Sony Liv
Political Thriller
OTT Series
Web Series
Shweta Basu Prasad
Vipin Sharma

More Telugu News