Divya Gautam: బీహార్ ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి

Sushant Singh Rajputs sister Divya Gautam in Bihar election fray
  • లెఫ్ట్ పార్టీ టికెట్ తో బరిలోకి దిగుతున్న దివ్యా గౌతమ్
  • వచ్చే నెల 6, 11 తేదీలలో బీహార్ లో పోలింగ్
  • ప్రతిపక్ష కూటమిలో ఇంకా తేలని సీట్ల పంపకాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి దివ్యా గౌతమ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ టికెట్ పై దిఘా నియోజకవర్గంలో ఆమె బరిలోకి దిగారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) మాజీ ప్రెసిడెంట్ అయిన దివ్య.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) పార్టీ తరఫున రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

ప్రతిపక్ష మహాఘట్ బంధన్ పార్టీలలో సీపీఐ (ఎంఎల్) కూడా ఒకటి. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారు కానప్పటికీ కూటమిలోని చిన్న పార్టీలు వివిధ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. సుశాంత్ సింగ్ సోదరి దివ్యా గౌతమ్ అభ్యర్థిత్వం కూడా సీపీఎం (ఎంఎల్) ఇదేవిధంగా నిర్ణయించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 6, 11 తేదీలలో పోలింగ్ నిర్వహించి, 14వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.
Divya Gautam
Sushant Singh Rajput
Bihar Elections 2024
Digha Constituency
CPI ML
All India Students Association
Mahagathbandhan
Bihar Assembly Elections

More Telugu News