పాక్ ప్రధాని ముందే ‘ఇండియా గ్రేట్ కంట్రీ’ అంటూ ట్రంప్ పొగడ్తలు
- భారత్, పాక్ సామరస్యంగా కలిసి ఉంటాయని భావిస్తున్నానని వ్యాఖ్య
- ఈజిప్టులో జరిగిన పీస్ సదస్సు వేదికపై ట్రంప్ ప్రసంగం
- కలిసి ఉంటారు కదా? అంటూ వెనకే ఉన్న షెహబాజ్ ను ప్రశ్నించిన ట్రంప్
భారత్ తో గొడవ పడకుండా కలిసి ఉంటారు కదా? అని అడగగా షెహబాజ్ షరీఫ్ కు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే అన్నట్లు నవ్వుతూ తలూపడం కనిపించింది. అమెరికా అధ్యక్షుడి ప్రసంగం పూర్తైన తర్వాత మైక్ ముందుకు వచ్చిన షెహబాజ్ షరీఫ్.. ట్రంప్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
ట్రంప్ ను శాంతిదూతగా అభివర్ణిస్తూ.. భారత్, పాక్ ల మధ్య అణు యుద్ధం జరగకుండా ట్రంప్ ఆపారని చెప్పారు. ఆ నాలుగు రోజుల (భారత్, పాక్ ల మధ్య ఘర్షణ జరిగిన) లో ట్రంప్ కనుక జోక్యం చేసుకోకుంటే ఏం జరిగిందనేది చెప్పడానికీ ఎవరూ మిగిలి ఉండే వారు కాదని షెహబాజ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని పొగడ్తలతో ట్రంప్ ఇక మాట్లాడేందుకు ఏమీలేదని, ఇంటికి వెళ్లిపోదామంటూ మైక్ లో చమత్కరించారు.