Telangana Liquor Policy: ఆ రూ.3 లక్షలు తిరిగి ఇచ్చేలా ఆదేశించండి: మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

Telangana Liquor Policy Petition Filed in High Court Seeking Refund of Application Fee
  • టెండర్ దక్కని వారికి డబ్బు తిరిగి వచ్చేలా ఆదేశించాలని కోరిన పిటిషనర్
  • లాటరీలో దుకాణం దక్కకపోతే ఆ మొత్తం ఆబ్కారీ శాఖకే వెళుతుందన్న పిటిషనర్
  • మద్యం పాలసీపై జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరిన పిటిషనర్
తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. మద్యం దుకాణాల కోసం టెండర్ దాఖలు చేసినప్పుడు చెల్లించిన మొత్తం ఆబ్కారీ శాఖకే వెళుతుందని, టెండర్ పొందని వారికి ఆ డబ్బు తిరిగి వచ్చేలా ఆదేశించాలని కోరుతూ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

మద్యం టెండర్ కోసం ఒక్కో దరఖాస్తుకు రుసుముగా రూ. 3 లక్షలు నిర్ణయించారని, లాటరీలో మద్యం దుకాణం దక్కని పక్షంలో ఆ మొత్తం ఎక్సైజ్ శాఖకే చెందుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా సంబంధిత శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అంతేకాకుండా, మద్యం విధానంపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Telangana Liquor Policy
Telangana
Excise Department
High Court
Liquor Tender
Anil Kumar
Liquor Policy

More Telugu News