Chiranjeevi: మనవరాలి కోరిక.. కుటుంబంతో చిరంజీవిని కలిసిన బీజేపీ నేత
- ఆస్ట్రేలియాలో ఉంటున్న రామచందర్ రావు మనవరాలు ఐరా ఆశీష్
- షూటింగ్ స్పాట్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన రామచందర్ రావు కుటుంబం
- చిరంజీవి విలువైన సమయం కేటాయించారన్న రామచందర్ రావు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తన మనవరాలి కోరిక మేరకు ఆమెతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రామచందర్ రావు మనవరాలు ఐరా ఆశీష్ ఇటీవల భారత్‌కు వచ్చారు. చిరంజీవిని కలవాలన్న ఆమె ఆకాంక్ష మేరకు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి షూటింగ్ స్పాట్‌కు వెళ్ళి కలిశారు. ఈ విషయాన్ని రామచందర్ రావు 'ఎక్స్' వేదికగా తెలియజేశారు.
చిరంజీవితో పాటు హీరోయిన్ నయనతారను కూడా రామచందర్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. చిరంజీవితో జరిగిన సమావేశంలో సినిమా విశేషాలతో పాటు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు ఆలోచనలు పంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి ఎంతో ఆప్యాయతతో, విలువైన సమయం కేటాయించారని రామచందర్ రావు అన్నారు. తమకు సమయం ఇచ్చినందుకు చిరంజీవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో జరిగిన ఈ కలయిక తమ కుటుంబానికి ఒక మరపురాని ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు.