Sanjay Kumar IPS: ఐపీఎస్ సంజయ్‌కు ఏసీబీ కోర్టులో నిరాశ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
- నిధుల దుర్వినియోగం కేసులో జైల్లో ఉన్న సంజయ్
- బెయిల్ కోసం కోర్టులో పిటిషన్
- ఏసీబీ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్‌కు విజయవాడ ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ), సీఐడీ అదనపు డీజీగా సంజయ్ కుమార్ పనిచేసిన కాలంలో సుమారు రూ.1.5 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ విభాగం తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి, గతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, ఏసీబీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు, బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. తాజాగా బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురికావడంతో, సంజయ్ కుమార్ మరికొంత కాలం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.