Warangal Collectorate: వరంగల్ కలెక్టరేట్‌లో.. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నం

Warangal Collectorate Employee Accused of Sexual Assault Suspended
  • అత్యాచార యత్నం చేసిన ఎస్టాబ్లిష్మెంట్ విభాగం సీనియర్ అసిస్టెంట్‌ 
  • బాధితురాలి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
  • నిందితుడిని సస్పెండ్ చేసిన కలెక్టర్
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఆరోపణలపై ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్ తక్షణమే సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం కలెక్టరేట్ ప్రాంగణంలోనే నిందితుడైన సీనియర్ అసిస్టెంట్.. తనతో పాటే పనిచేసే మహిళా సిబ్బందిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అతని బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాధితురాలు నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై లైంగిక వేధింపులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఫణికుమార్ తెలిపారు.

ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి నిందితుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కలెక్టరేట్ వంటి కీలకమైన ప్రదేశంలో ఒక అధికారి ఇంతటి దారుణానికి పాల్పడటం వెనుక ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని తోటి మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఇలాంటి వేధింపుల ఆరోపణలు వచ్చిన మరో ఉద్యోగిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారని వారు గుర్తుచేస్తున్నారు. ఈ తాజా ఘటనతో కలెక్టరేట్‌లోని మహిళా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. 
Warangal Collectorate
Warangal
sexual harassment
woman employee
senior assistant
SC ST Atrocity Act
Subedari Police Station
Telangana
crime
employee suspension

More Telugu News