Nagarjuna: నాగార్జున 'శివ' రీ రిలీజ్ ఎప్పుడంటే...!

Nagarjuna Shiva Re release Date Announced
  • అక్కినేని నాగార్జున - అమల జంటగా ఆర్జీవీ తెరకెక్కించిన మూవీ శివ 
  • 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్ ప్రకటన
  • నవంబర్ 14న రి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాతలు
తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన ‘శివ’ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన ఈ క్లాసిక్ చిత్రం 1989 అక్టోబర్ 5న విడుదలై ఒక ట్రెండ్‌ను సృష్టించింది.

ఆ కాలంలో కాలేజ్ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, తన వాస్తవికత, శబ్ద రూపకల్పన, పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా నాగార్జున సైకిల్ చైన్ పట్టుకుని చేసే పోరాట సన్నివేశాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ విధంగా "సైకిల్ చైన్" అప్పట్లో యువతకు ఒక చిహ్నంగా మారింది.

ఈ సినిమా నాగార్జున కెరీర్‌కు ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఆయన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి చేర్చింది. ఆర్జీవీ ఈ సినిమాను తరువాత హిందీలో కూడా రూపొందించి బాలీవుడ్‌లో విజయం సాధించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నిర్మాతలు దీనిని నవంబర్ 14న తిరిగి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టికెట్లు లేకుండా ఉచితంగా ప్రదర్శించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్లు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. 35 ఏళ్ల తరువాత తిరిగి విడుదల అవుతున్న శివ సినిమా పట్ల అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 
Nagarjuna
Shiva movie
Ram Gopal Varma
Amala Akkineni
Telugu cinema
Shiva re-release
RGV Shiva
Akkineni Nagarjuna
Cycle chain fight
Classic Telugu movies

More Telugu News