Panchumarthi Anuradha: ఆ పాపం మీదే, డ్రామాలు ఆపండి: రోజాపై పంచుమర్తి అనురాధ ఫైర్

Panchumarthi Anuradha Fires on Roja Over Adulterated Liquor Issue
  • కల్తీ మద్యం వ్యవహారంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
  • వైసీపీ నేత రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు
  • మాట మీద నిలకడ లేకే 'తైతక్కల రోజా' అనాల్సి వస్తోందని వ్యాఖ్య
  • మొలకలచెరువు కల్తీ మద్యం పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని బయటపెట్టిందన్న అనురాధ
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలకడ లేకపోవడం వల్లే రోజాను 'తైతక్కల రోజా' అని పిలవాల్సి వస్తోందంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొలకలచెరువులో ఇటీవల వెలుగుచూసిన కల్తీ మద్యం వ్యవహారానికి గత వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

"పీనుగ పోయినా... ఆ పీనుగ చేసిన పాపం ఇంకా అక్కడ అక్కడ కన్పిస్తూనే ఉంది తైతక్కల రోజా గారు. మీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు... అది గుర్తుంచుకోండి. మీ పాపాల్ని తుడిచే ప్రయత్నంలోనే మొలకల చెరువులో కల్తీ సారా వ్యవహరం వెలుగులోకి వచ్చిందనే విషయం తెలుసుకోండి. 

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ కల్తీ సారా పాపం పురుడు పోసుకుంది. దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయట పెట్టింది. మొలకల చెరువు కల్తీ సారా అంశాన్ని బయట పెట్టింది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వంలోని ఎక్సైజ్ అధికారులు, మేము ప్రక్షాళన చేస్తుంటే... ఆ పాపాన్ని ప్రభుత్వంపై నెడతున్నారు. గొడ్డలి పోటు నుంచి గులక రాయి వరకు మీ డ్రామాలు చూశాం. 

మీరు ఇలా మాట్లాడ్డం... మాకేం ఆశ్చర్యమనిపించడం లేదు. తప్పు మీరు చేయడం.. నెపాన్ని మా మీద నెట్టడం మీకు అలవాటేగా...? వివేకా హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ వద్దని జగన్ ఎందుకు డిమాండ్ చేశారనే దానికి సమాధానం చెప్పి.. ఆ తర్వాత కల్తీ లిక్కర్ వ్యవహరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే బాగుంటుంది" అని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.
Panchumarthi Anuradha
RK Roja
Roja Selvamani
TDP
YCP
Molakalacheruvu
Adulterated Liquor
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy

More Telugu News