Kuldeep Yadav: భారత్-విండీస్ రెండో టెస్ట్: క్లీన్ స్వీప్ దిశగా టీమిండియా

Kuldeep Yadav Shines India vs West Indies 2nd Test
   
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి విండీస్ 8 వికెట్ల నష్టానికి  217 పరుగులు చేసి, భారత్ కంటే 301 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్ నైట్ స్కోరు 140/4తో మూడో రోజు ఆట ప్రారంభించిన కరీబియన్ జట్టుకు తొలుత కుల్దీప్ యాదవ్ షాకిచ్చాడు. తొలి సెషన్‌లో విండీస్ కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడింటిని కుల్దీప్ కైవసం చేసుకున్నాడు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. 

రెండో రోజు నిప్పులు చెరిగిన రవీంద్ర జడేజా బౌలింగ్‌ను ఈ రోజు వెస్టిండీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. అయితే, కుల్దీప్ మాత్రం చకచకా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. షాయ్ హోప్ (36) వికెట్‌తో బోణీ కొట్టిన కుల్దీప్ ఆ వెంటనే టెవిన్ ఇమ్లాక్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17)ను బోల్తా కొట్టించాడు. ఇక, వారికన్‌ (1)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఖారీ పియర్రీ (19), అండర్సన్ ఫిలిప్ (19) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది.
Kuldeep Yadav
India vs West Indies
West Indies tour of India
India cricket
West Indies cricket
Ravindra Jadeja
Shai Hope
cricket test match
India vs WI 2nd test
cricket news

More Telugu News