Taliban: తాలిబన్ల ఎదురుదాడి.. పాక్ సోల్జర్లు 15 మంది మృతి

Taliban Counterattack 15 Pakistan Soldiers Killed
  • హెల్మాండ్ ప్రావిన్స్ లో పాక్ సైన్యం వైమానిక దాడులు
  • కాల్పులతో విరుచుకుపడ్డ ఆఫ్ఘానిస్థాన్ దళాలు
  • సరిహద్దుల్లోని పలు ఔట్ పోస్టులు స్వాధీనం
ఆఫ్ఘానిస్థాన్ భూభాగంపై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబన్లు కాల్పులతో విరుచుకుపడుతున్నారు. సరిహద్దుల్లోని పాక్ జవాన్లపై మెరుపు దాడులు చేసి ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 15 మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. కునార్, హెల్మాండ్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యం నుంచి తాలిబన్ దళాలు అనేక అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘానిస్థాన్ రక్షణ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.


హెల్మాండ్ ప్రావిన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మౌలావి మహమ్మద్ ఖాసీం రియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం రాత్రి డ్యూరాండ్ లైన్ వెంబడి పాక్ బలగాలతో జరిగిన ఘర్షణలో దాదాపు 15 మంది శత్రుదేశ సైనికులు మరణించారని చెప్పారు. ఇటీవల కాబూల్, పక్టికా ప్రావిన్స్ లలో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే బార్డర్ లో కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. హెల్మాండ్ తో పాటు కాందహార్, జాబుల్, పక్టికా, పక్టియా, ఖోస్ట్, నంగార్హర్, కూనార్ ప్రాంతాల్లోని పాకిస్థానీ ఔట్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఆఫ్ఘానిస్థాన్ బలగాలు దాడులు చేస్తున్నాయని వివరించారు.
Taliban
Pakistan
Pakistan Soldiers Killed
Afghanistan
Durand Line
Helmand Province
Kunar Province
Taliban Attacks
Pakistan Air Strikes

More Telugu News