Nara Lokesh: నేడు విశాఖకు మంత్రి నారా లోకేశ్ .. సిఫీ డెటా సెంటర్‌కు శంకుస్థాపన

Nara Lokesh to Inaugurate Sify Data Center in Vizag
  • సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ 
  • రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ డేటా సెంటర్‌
  • ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ కూడా ఏర్పాటు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు పడనుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు విశాఖపట్నంలో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ టెక్నాలజీ సంస్థ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఇందులో 50 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఏఐ ఆధారిత డేటా సెంటర్ రూపంలో విశాఖ గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా అవతరించనుంది. ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ద్వారా భారతదేశం, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఏర్పడనుంది.

విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 5 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం విశాఖలో ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 
Nara Lokesh
Andhra Pradesh
Vizag
Sify Technologies
Data Center
IT Hub
Digital Hub
Investment
Employment
AI Edge Data Center

More Telugu News