ప్రభుత్వ శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డి లేఖ
- ప్రైవేటు ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారన్న చిన్నారెడ్డి
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని విమర్శ
ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకపోవడంతో పాటు దాదాపు 20 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని వాపోయారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 2023 కంపెనీస్ యాక్ట్ 8 ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా ఇదే తరహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్‌ను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి కోరారు.