Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు: మల్లు భట్టివిక్రమార్క

Naveen Yadav will win Jubilee Hills by election with huge majority says Bhatti Vikramarka
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్
  • నవీన్ యాదవ్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన మల్లు భట్టివిక్రమార్క
  • ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్ష
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అద్భుతమైన ఆధిక్యంతో గెలుపొందడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ప్రకటించిన తర్వాత ఆయన భట్టివిక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నవీన్ యాదవ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు, ప్రజల అభిప్రాయాలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. నవీన్ యాదవ్‌కు మల్లు భట్టి విక్రమార్క పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Naveen Yadav
Jubilee Hills by election
Mallu Bhatti Vikramarka
Telangana Deputy Chief Minister

More Telugu News