Chiranjeevi: వీసీ సజ్జనార్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi meets VC Sajjanar
  • నాలుగేళ్ల పాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్
  • ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
  • పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు నాలుగేళ్ల పాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్ ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి సజ్జనార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో ఇరువురు కలిసి పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. గతంలో సైబరాబాద్ సీపీగా సజ్జనార్ పనిచేసిన సమయంలో, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు ప్లాస్మా దానం యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇరువురు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో సజ్జనార్ మళ్లీ పోలీస్ యూనిఫామ్ ధరించడంతో చిరంజీవి ఆయనను కలిసి అభినందించారు.
Chiranjeevi
VC Sajjanar
Hyderabad Police Commissioner
TSRTC MD
Plasma donation
Cyberabad CP

More Telugu News