Naveen Yadav: మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డిలను కలిసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి

Naveen Yadav Meets Mallu Bhatti Vikramarka and Jana Reddy
  • ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించిన కాంగ్రెస్
  • ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్న నవీన్ యాదవ్
  • రాములు నాయక్, దానం నాగేందర్‌లను కూడా కలిసిన నవీన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి చెందిన పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.

జానారెడ్డితో పాటు రైతు కమిషన్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి.
Naveen Yadav
Jubilee Hills
Mallu Bhatti Vikramarka
Jana Reddy
Telangana Congress
By Election

More Telugu News