Chandrababu Naidu: నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ లో స్మార్ట్ స్ట్రీట్... వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches Nellore Smart Street Virtually
  • డ్వాక్రా మహిళలే యజమానులు... నెల్లూరులో అందుబాటులోకి స్మార్ట్ స్ట్రీట్
  • 30 కంటైనర్లలో 120 దుకాణాలు
  • 'ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త' పథకం కింద కేటాయింపు
  • సోలార్ విద్యుత్, ఫ్రీ వైఫై, సీసీ కెమెరాల వంటి ఆధునిక సౌకర్యాలు
  • రాష్ట్రంలోని ఇతర నగరాలకూ ఈ నమూనాను విస్తరిస్తామన్న మంత్రి నారాయణ
డ్వాక్రా సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నెల్లూరు నగరంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మైపాడు గేట్ సెంటర్ వద్ద అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 'స్మార్ట్ స్ట్రీట్'ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ స్మార్ట్ స్ట్రీట్‌లో భాగంగా 30 ప్రత్యేక కంటైనర్లను ఉపయోగించి మొత్తం 120 దుకాణాలను ఏర్పాటు చేశారు. 'ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త' పథకం కింద ఈ దుకాణాలన్నింటినీ పూర్తిగా డ్వాక్రా సంఘాల మహిళలకే కేటాయించారు. వీటిలో ఫుడ్ స్టాల్స్, నగల దుకాణాలు సహా పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, లబ్ధిదారులైన మహిళలతో వీడియో లింక్ ద్వారా నేరుగా మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు.  తమకు ఇలాంటి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ స్మార్ట్ స్ట్రీట్ అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ పూర్తిగా సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తారని, వినియోగదారుల కోసం ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. భద్రత కోసం సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో విజయవంతమైన ఈ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఇలాంటి స్మార్ట్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
Chandrababu Naidu
Nellore
Smart Street
DWCRA women
Maipadu Gate Center
Andhra Pradesh
MSME
Small business
Narayana Minister
Solar power

More Telugu News