Vangalapudi Anitha: దళితులను రెచ్చగొట్టేందుకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు: అనిత

Vangalapudi Anitha reacts to Ambedkar statue burning in Chittoor
  • చిత్తూరు జిల్లా దేవళంపేటలో హోంమంత్రి అనిత పర్యటన
  • దగ్ధమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
  • నిందితులను కఠినంగా శిక్షిస్తామని హోచ్చరిక
చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు దహనం చేసిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ చర్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దళితులను రెచ్చగొట్టేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. శనివారం దేవళంపేటలో పర్యటించిన మంత్రి, అగ్నికి ఆహుతైన అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, "అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక కొందరు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

గతంలో జరిగిన డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితా రాణి ఘటనలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు రాజకీయ ముసుగు వేసుకుని తిరుగుతున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని ఆమె హామీ ఇచ్చారు. 
Vangalapudi Anitha
Anitha Vangalapudi
Chittoor
Ambedkar statue
Dalits
Andhra Pradesh
Devalampeta
YS Jagan
Home Minister Andhra Pradesh
Political conspiracy

More Telugu News