Chennai Street Names: నవంబర్ 19 డెడ్‌లైన్... చెన్నైలో మారనున్న 3,400 వీధుల పేర్లు
- చెన్నైలో కులాల పేర్లతో ఉన్న వీధుల పేర్ల తొలగింపునకు శ్రీకారం
- నాయకులు, పువ్వులు లేదా తటస్థ పేర్లతో నామకరణం
- ప్రజల అభిప్రాయంతోనే కొత్త పేర్లను ఖరారు చేయాలని నిర్ణయం
- నవంబర్ 19 కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం
చెన్నై నగరంలో సామాజిక సంస్కరణల దిశగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరవ్యాప్తంగా కులాల పేర్లతో ఉన్న సుమారు 3,400 వీధుల పేర్లను మార్చే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ వీధులకు బదులుగా ప్రముఖ నాయకులు, పువ్వుల పేర్లు లేదా ఇతర సామాజికంగా తటస్థంగా ఉండే పేర్లను పెట్టనున్నారు.
కుల గుర్తింపులను తొలగించాలన్న తమిళనాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో మొత్తం 35,000 వీధులు ఉండగా, వాటిలో సుమారు 3,400 వీధులకు కులాల పేర్లు ఉన్నట్లు డిప్యూటీ మేయర్ మహేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా, నగరంలో కొత్తగా విలీనమైన ఏడు జోన్లలో ఇలాంటి వీధులు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 19వ తేదీలోగా ఈ వీధులన్నింటికీ కొత్త పేర్లు పెట్టే ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం రెవెన్యూ శాఖ సహకారంతో ఈ వీధుల జాబితాను అధికారిక రిజిస్టర్ల ఆధారంగా ధ్రువీకరిస్తున్నామని, సోమవారాని కల్లా తుది జాబితా సిద్ధమవుతుందని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్. తిరుమురుగన్ వివరించారు. జాబితా ఖరారైన తర్వాత, సంబంధిత వార్డుల కౌన్సిలర్లు ‘ఏరియా సభ’ సమావేశాలు నిర్వహించి, ప్రజల ఏకాభిప్రాయంతో కొత్త పేర్లను నిర్ణయిస్తారు.
పేర్ల మార్పు ప్రక్రియకు అధికారులు స్పష్టమైన విధానాన్ని అనుసరించనున్నారు. పేరు మొత్తం కులాన్ని సూచిస్తే, దాని స్థానంలో నాయకులు లేదా పువ్వుల పేర్లు పెడతారు. మార్పు కోసం గుర్తించిన వాటిలో కొడంబాక్కంలోని గంగురెడ్డి రోడ్, రెడ్డి స్ట్రీట్, వన్నియార్ స్ట్రీట్, సైదాపేటలోని బ్రాహ్మిణ్ స్ట్రీట్ వంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత, కొత్త పేర్లతో త్రీడీ రిఫ్లెక్టివ్ నేమ్ బోర్డులను ఏర్పాటు చేయడానికి టెండర్లను పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు.