Kanishk: తిరుపతిలో ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు యువకుల దుర్మరణం

Two students die in Tirupati flyover accident
  • గరుడ వారధిపై ఘటన
  • మోహన్ బాబు యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్ధులు
  • బుల్లెట్ బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురైన వైనం
తిరుపతి గరుడ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. చంద్రగిరి మండలం కందులవారిపల్లెకు చెందిన డి. కనిష్క్ (21), కొటాల గ్రామానికి చెందిన కె.వాత్సవ (19) ఏ.రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు.

వీరు ఇద్దరూ బుల్లెట్ బైక్‌పై తిరుపతి గరుడ వారధిపై వేగంగా వెళుతుండగా, లక్ష్మీపురం కూడలి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు సుమారు 30 అడుగుల దిగువన ఉన్న ప్రధాన రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
Kanishk
Tirupati accident
Garuda Varadhi
Road accident
Mohan Babu University
Kotala
Bike accident
Andhra Pradesh news

More Telugu News