Amaravati farmers: రాజధాని రైతులకు కౌలు నిధుల విడుదల

Amaravati Farmers Receive Pending Lease Funds
  • సాంకేతిక కారణాలతో 495 మంది రైతుల ఖాతాలకు జమ కాని వార్షిక కౌలు
  • తాజాగా ఆ రైతుల ఖాతాలో పెండింగ్ వార్షిక కౌలు మొత్తాలను జమ చేసిన ప్రభుత్వం
  • పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన సీఆర్డీఏ కమిషనర్  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించాల్సిన వార్షిక కౌలులో పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని తాజాగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.

రైతుల బ్యాంకు ఖాతాల లింకేజీ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాలు, కొందరు రైతులు ప్లాట్లను విక్రయించడం, మరణించిన రైతుల వారసుల ఖాతాల వివరాలు సకాలంలో అధికారులకు అందకపోవడం తదితర కారణాల వల్ల పలువురు రైతుల ఖాతాల్లో 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి వార్షిక కౌలు సొమ్ము ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) జమ చేయలేకపోయింది.

ఈ తరహాలో ఉన్న సమస్యలను తాజాగా సీఆర్డీఏ అధికారులు పరిష్కరించారు. ఈ క్రమంలో 495 మంది రైతులకు అందాల్సిన పెండింగ్ వార్షిక కౌలు రూ. 6,64,80,402 లను సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేసింది. ఈ మొత్తం నగదులో 9వ, 10వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించి 232 మందికి గాను రూ.4,08,41,632, అలాగే 11వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించి 263 మందికిగాను రూ.2,56,38,770 సంబంధిత రైతులు, భూ యజమానుల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్టు సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 
Amaravati farmers
Andhra Pradesh
CRDA
land pooling scheme
farmer compensation
capital region development authority
farmer bank accounts
annual lease payments
AP CRDA
farmers welfare

More Telugu News