Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవీన్ యాదవ్‌కు మద్దతు తెలిపిన నటుడు సుమన్

Suman Supports Naveen Yadav in Jubilee Hills Bypoll
  • సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిలకు సుమన్ ధన్యవాదాలు
  • నవీన్ యాదవ్ యువకుడు, సేవానిరతి కలిగిన వ్యక్తి అన్న సుమన్
  • నవీన్‌ను అత్యంత మెజార్టీతో గెలిపించాలన్న సుమన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన మద్దతు ఉంటుందని ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నవీన్ యాదవ్ యువకుడని, సేవా నిరతి కలిగిన వ్యక్తి అని సుమన్ కొనియాడారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో తన మద్దతు నవీన్‌కు ఎప్పుడూ ఉంటుందని, ఆయనను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. "ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్" అని ఆయన ముగించారు.

యూసుఫ్‌గూడ, రెహ్మత్ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు సుపరిచితం. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ రాజకీయాలతో పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు ఖైరతాబాద్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపేవారు. అయితే ఆయన అన్ని పార్టీలకు సమదూరం పాటించేవారు.
Naveen Yadav
Jubilee Hills byelection
Suman
Congress Party
Telangana Politics
Revanth Reddy
Yusufguda
Rahmath Nagar

More Telugu News