LG Electronics India: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీవో సంచలనం.. రూ.4.4 లక్షల కోట్ల బిడ్లతో ఆల్ టైమ్ రికార్డ్!

LG Electronics India IPO Creates Sensation Record Bids of 44 Trillion Rupees
  • సరికొత్త చరిత్ర సృష్టించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీవో
  • ఏకంగా 54 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన పబ్లిక్ ఇష్యూ
  • మొత్తం రూ.4.4 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలు
  • గత రికార్డులను అధిగమించి తొలి స్థానంలో నిలిచిన ఎల్జీ
  • మరోవైపు వెండి ధరలోనూ రికార్డుల హోరు
  • లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
భారత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) మార్కెట్ చరిత్రలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందనను అందుకున్న ఈ కంపెనీ ఐపీవో, బిడ్ల విలువ పరంగా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. గురువారంతో ముగిసిన ఈ పబ్లిక్ ఇష్యూకు ఏకంగా రూ.4.4 లక్షల కోట్ల విలువైన బిడ్లు రావడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ.11,607 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఇష్యూలో భాగంగా 7.13 కోట్ల షేర్లను జారీ చేయగా, చివరి రోజు ముగిసే సమయానికి ఏకంగా 385 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. అంటే, ఇష్యూ పరిమాణం కంటే 54.02 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయింది. ఇప్పటివరకు ఏ భారతీయ ఐపీవోకి ఇంత భారీ స్థాయిలో స్పందన లభించలేదు. గత ఏడాది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోకు వచ్చిన రూ.3.24 లక్షల కోట్ల బిడ్ల రికార్డును ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా అధిగమించింది.

పరుగులు పెడుతున్న వెండి ధర
మరోవైపు, బులియన్ మార్కెట్లో వెండి ధర రికార్డుల మోత మోగిస్తోంది. గురువారం ఒక్కరోజే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.6,000 పెరిగి రూ.1.63 లక్షల వద్ద సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి ధర 72 శాతం పెరిగినట్లయింది. అయితే, పది గ్రాముల బంగారం ధర మాత్రం రూ.1,23,600 వద్ద స్థిరంగా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ వెండి ధర 50 డాలర్ల మార్కును దాటింది. 
LG Electronics India
LG Electronics IPO
IPO
public issue
Indian stock market
share subscription
Bajaj Housing Finance
silver price
gold price
bullion market

More Telugu News