AP Transfer: ఏపీలో 31 మంది అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీ... పూర్తి జాబితా ఇదిగో!

AP Government Transfers 31 All India Service Officers
  • పలు కీలక శాఖల్లో భారీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు
  • వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా మనజీర్ జిలానీ నియామకం
  • కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా చక్రధర్ బాబుకు బాధ్యతలు
  • ఏపీపీఎస్సీ కార్యదర్శిగా రవి సుభాష్‌కు కొత్త పోస్టింగ్
  • పౌరసరఫరాల సంస్థ సీఎండీగా శివశంకర్ లోతేటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 31 మంది అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పలు కీలక శాఖలకు కొత్త అధిపతులు రానున్నారు.

ఈ బదిలీల్లో భాగంగా పలువురు సీనియర్ అధికారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా మనజీర్ జిలానీ సామున్‌ను నియమించగా, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బాధ్యతలను చక్రధర్ బాబుకు అప్పగించారు. అదేవిధంగా, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా రవి సుభాష్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా శివశంకర్ లోతేటి బాధ్యతలు చేపట్టనున్నారు. పౌరసరఫరాల శాఖ వైస్ ఛైర్మన్‌గా ఎస్. ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్‌గా పి. రంజిత్ బాషా, హౌసింగ్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్‌గా అరుణ్ బాబు నియమితులయ్యారు.

1. కొల్లాబత్తుల కార్తీక్ - నంద్యాల జాయింట్ కలెక్టర్
2. శ్రీధర్ బాబు - కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్
3. శుభమ్ బన్సల్ - పరిశ్రమల శాఖ డైరెక్టర్
4. మనజీర్ జిలానీ - వ్యవసాయ శాఖ డైరెక్టర్
5. అభిషేక్ గౌడ - ఏలూరు జాయింట్ కలెక్టర్
6. రవిసుభాష్ - ఏపీపీఎస్సీ కార్యదర్శి
7. నూరుల్ - కర్నూలు జాయింట్ కలెక్టర్
8. శివశంకర్ లోతేటి - ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
9. ఢిల్లీ రావు - పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్
10. రాహుల్ మీనా - రాజమండ్రి మున్సిపల్ కమిషనర్
11. పి. రంజిత్ బాషా - ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
12. అపూర్వ భరత్ - కాకినాడ జాయింట్ కలెక్టర్
13. మౌర్య భరద్వాజ్ - శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్
14. అరుణ్ బాబు - హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీ
15. జేవీ మురళి - సీసీఏల్ఏ కార్యదర్శి
16. సహదిత్ వెంకట్ త్రివినాగ్ - గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి
17. టీఎస్ చేతన్ - సీసీఏఎల్ సంయుక్త కార్యదర్శి
18. కొమ్మిశెట్టి మురళీధర్ - ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి
19. ప్రసన్న వెంకటేశ్ - లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ
20. బి. నవ్య - రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్
21. ఎస్. భరణి - స్టెప్ కమిషనర్
22. ప్రవీణ్ ఆదిత్య - ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ
23. తిరుమణి శ్రీపూజ - అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్
24. కేఎల్ విశ్వనాథన్ - ఐ అండ్ పీఆర్ డైరెక్టర్
25. గోవిందరావు - పౌరసరఫరాల శాఖ
26. ఎస్. చిన్నరాముడు - ఎస్సీ కమిషన్ కార్యదర్శి
27. జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ - ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ
28. ఎస్ఎస్ భావన - బాపట్ల జాయింట్ కలెక్టర్
29. సి. విష్ణుచరణ్ - సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ కార్యదర్శి
30. ఎస్ఎస్ శోభిక - వైద్యఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి
31. అభిషేక్ కుమార్ - ఏపీ మారిటైం బోర్డు సీఈవో
AP Transfer
Manazir Jilani Samoon
AP government
IAS officers transfers
chakradhar babu
APPSC
Ravi Subhash
Shiva Shankar Loteti
AP civil supplies
AP transfers list

More Telugu News