Ola Electric: ఓలా సర్వీస్‌పై తీవ్ర ఆగ్రహం.. షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని

Ola Electric Scooter Set Ablaze by Owner Over Service Issues
  • గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో చోటుచేసుకున్న ఘటన
  • కంపెనీ సర్వీస్‌పై అసంతృప్తితో యజమాని నిరసన
  • మార్గమధ్యంలో స్కూటీ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడమే కారణం
  • ఫిర్యాదుపై కంపెనీ సరిగా స్పందించలేదని తీవ్ర ఆగ్రహం
  • షోరూం ఎదుటే అందరూ చూస్తుండగా వాహనానికి నిప్పు
తాను కొన్న ఎలక్ట్రిక్ స్కూటీకి సంబంధించిన సమస్యపై కంపెనీ సరిగా స్పందించడం లేదని ఆగ్రహించిన కొనుగోలుదారుడు అందరూ చూస్తుండగానే షోరూం ఎదుటే తన వాహనానికి నిప్పుపెట్టాడు. గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, పాలన్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని కొన్నాడు. తన భార్య, కుమారుడితో కలిసి షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో స్కూటీ స్టీరింగ్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. ఈ ఘటనలో వారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అతను, తన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి పంపించేశాడు.

అనంతరం, విరిగిపోయిన స్కూటీని నేరుగా షోరూంకు తీసుకెళ్లి సమస్యను వివరించాడు. అయితే, కంపెనీ ప్రతినిధుల నుంచి అతనికి సరైన సమాధానం గానీ, భరోసా గానీ లభించలేదని తెలుస్తోంది. కంపెనీ తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆ వ్యక్తి, క్షణికావేశంలో షోరూం ఎదుటే స్కూటీకి నిప్పంటించాడు. మంటలు వేగంగా వ్యాపించి వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. ఈ అనూహ్య ఘటనతో షోరూం సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Ola Electric
Ola Electric scooter
Electric scooter fire
Palampur Gujarat
Ola scooter steering issue
Electric vehicle safety
Customer complaint
Vehicle malfunction
Electric scooter accident
Ola customer dissatisfaction

More Telugu News