Pattabhi Ram Kommareddy: రూ.500 కోట్ల కాలేజీకి జగన్ ప్రభుత్వం ఇచ్చింది రూ.11.7 కోట్లే: పట్టాభి

Pattabhi Criticizes Jagan Over Narsipatnam Medical College Funds
  • నర్సీపట్నం మెడికల్ కాలేజీపై జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ
  • ఏ ముఖం పెట్టుకుని నర్సీపట్నం వెళ్తున్నారని ప్రశ్న
  • వైఎస్సార్ ను చూసి నేర్చుకోవాలని హితవు
నర్సీపట్నం పర్యటనకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్‌పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ.500 కోట్ల అంచనా వ్యయం ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణానికి గత ప్రభుత్వం కేవలం రూ.11.7 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అలాంటిది ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు అంచనా వేయగా, జగన్‌ హయాంలో కేవలం నామమాత్రపు నిధులు మాత్రమే విడుదల చేశారని ఆయన ఆరోపించారు. ఇంత తక్కువ నిధులు కేటాయించి, అభివృద్ధిని గాలికొదిలేసిన జగన్‌కు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోని విధానాలను పట్టాభి గుర్తుచేశారు. వైఎస్సార్ కూడా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలోనే ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకున్నారని, ఈ విషయాన్ని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 
Pattabhi Ram Kommareddy
Narsipatnam
YS Jagan Mohan Reddy
YSRCP
TDP
Medical College
Andhra Pradesh Politics
Swachha Andhra Corporation
Funding Allegations
Political Criticism

More Telugu News