Bachupally: అపార్ట్మెంట్ రెండో అంతస్తులో భారీ కొండచిలువ.. బాచుపల్లిలో కలకలం.. వీడియో ఇదిగో!

Python Found in Bachupally Apartment Creates Panic
  • తీవ్ర భయాందోళనలో అపార్ట్మెంట్ వాసులు
  • పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్
  • కొండచిలువను జాగ్రత్తగా తీసుకెళ్లి అడవిలో వదిలేసిన సొసైటీ సభ్యులు
అటవీ ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో కొండచిలువలు కనిపించడం సాధారణం.. అయితే, బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ కొండచిలువ ఒకటి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏకంగా రెండో అంతస్తులోని గదిలోకి కొండచిలువ దూరడం ఆ ఆపార్ట్మెంట్ వాసులను వణికించింది. వెంటనే పోలీసులకు, స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. వారు వచ్చి కొండచిలువను జాగ్రత్తగా పట్టి తీసుకెళ్లారు. దానిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు తర్వాత వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అపార్ట్మెంట్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ కొండచిలువ కనపించింది. రెండో అంతస్తులోని గదిలోకి దూరిన ఈ కొండచిలువను చూసి భయాందోళనలకు గురైన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ భారీ కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. అయితే, ఆ కొండచిలువ అపార్ట్మెంట్ రెండో అంతస్తు వరకు ఎలా చేరిందనేది అంతుపట్టడంలేదని పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు వివరించారు.
Bachupally
Bachupally snake
Hyderabad snake
Snake in apartment
Python rescue
Snake Society
Reddys Labs
Hyderabad news
Viral video

More Telugu News