శృంగారంపై గతంలో ఇలియానా చేసిన వ్యాఖ్యలు... మళ్లీ వైరల్
- శరీరాకృతి కోసం ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి అన్న ఇలియానా
- శృంగారం కూడా ఒక రకమైన మంచి వ్యాయామమేనని వ్యాఖ్య
- తన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారని కామెంట్
శరీరాకృతిని కాపాడుకోవడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి అని ఇలియానా ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే, శృంగారం కూడా ఒక మంచి వ్యాయామంలా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. శృంగారంలో కూడా శరీరం బాగా అలసిపోతుందని, శ్రమతో కూడుకున్న ఏ పనైనా శరీరానికి మేలు చేస్తుందని ఆమె వివరించారు.
అయితే, తన వ్యాఖ్యలను చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చని కూడా ఇలియానా అన్నారు. "చాలా మందిలో మెచ్యూరిటీ లోపించింది. నేను చెప్పిన విషయాన్ని పరిణతితో ఆలోచిస్తే సరిగ్గా అర్థం అవుతుంది. కానీ కొందరు దాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తారు" అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. నటిగా దక్షిణాదిలో అగ్రస్థానాన్ని అందుకున్న ఇలియానా, బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత ఇలాంటి బోల్డ్ కామెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.