Tilak Varma: హైదరాబాద్ రంజీ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

Tilak Varma Named Captain of Hyderabad Ranji Team
  • రంజీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ
  • తొలి మూడు మ్యాచ్‌ల కోసం 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్
  • జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ, వైస్ కెప్టెన్‌గా రాహుల్ సింగ్
  • ఇటీవలే ఆసియా కప్ ఫైనల్‌లో రాణించిన తిలక్ వర్మ
  • ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్‌లు
భారత యువ సంచలనం, తెలుగు తేజం తిలక్ వర్మకు కీలక బాధ్యతలు లభించాయి. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఆయన నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జట్టును అధికారికంగా ప్రకటించింది.

ఈ సీజన్‌లో భాగంగా ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్‌తో జరగనున్న తొలి మూడు మ్యాచ్‌ల కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్ వర్మకు కెప్టెన్‌గా అవకాశం ఇవ్వగా, రాహుల్ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ, ఆ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవాళీ టోర్నీలోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.

ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు వంటి వారికి చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా అలీ కచీ డైమండ్, రాహుల్ రాదేశ్‌లను ఎంపిక చేశారు.

ఎంపికైన జట్టు వివరాలు:
తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కచీ డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ఆటగాళ్లు:  పి. నితీశ్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేశ్ కనల, మిఖిల్ జైస్వాల్.
Tilak Varma
Hyderabad Ranji team
Ranji Trophy 2025-26
Hyderabad Cricket Association
Rahul Singh
Tanmay Agarwal
CV Milind
Rohit Rayudu
Ali Kachi Diamond
Asia Cup 2025

More Telugu News