Nara Lokesh: అదే నాకు పెద్ద బహుమతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Says Educating Children is Biggest Gift
  • అంతర్ జిల్లాల బదిలీ ఉపాధ్యాయులు, భాషా పండితులతో సమావేశమైన విద్యాశాాఖ మంత్రి నారా లోకేశ్
  • టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడి
  • మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు పిల్లలకు బాగా చదువు చెబితే అదే తనకు పెద్ద బహుమతి అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంతర్ జిల్లాల బదిలీలపై ఉపాధ్యాయులు, భాషా పండితులతో ఆయన నిన్న సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రతి ఉపాధ్యాయుడు రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారి సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంపై మంత్రి లోకేశ్ హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 
Nara Lokesh
AP Education Minister
Teachers Transfers
Andhra Pradesh Education
Education System
Teacher Problems
Inter District Transfers
AP Government

More Telugu News