Javed Habib: జావెద్ హబీబ్, ఆయన కుటుంబ సభ్యులపై 20 కేసులు నమోదు

Javed Habib and family face 20 cases of fraud
  • రూ.7 కోట్ల మేర ప్రజలను మోసం చేశారని ఆరోపణలు
  • హబీబ్ కుటుంబం ఓ గ్యాంగ్‌లా పనిచేసిందని పోలీసుల వెల్లడి
  • సుమారు 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు
దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన మోసం ఆరోపణల్లో చిక్కుకున్నారు. కుటుంబంతో కలిసి ఒక గ్యాంగ్‌లా ఏర్పడి ప్రజలను కోట్ల రూపాయల మేర మోసగించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వారిపై ఏకంగా 20 కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం సెలబ్రిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ కేసు వివరాలను సంభల్ జిల్లా ఎస్పీ కృష్ణ బిష్ణోయ్ మీడియాకు వెల్లడించారు. జావెద్ హబీబ్, ఆయన భార్య, కుమారుడు కలిసి సుమారు రూ.7 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 35 మంది బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. ‘ఫాలికల్ గ్లోబల్ కంపెనీ’ అనే సంస్థ పేరుతో ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇదే కాకుండా, జావెద్ హబీబ్ కుమారుడిపై గత సెప్టెంబర్‌ నెలలోనే క్రిప్టోకరెన్సీ స్కామ్‌కు సంబంధించి మరో కేసు నమోదైన విషయాన్ని కూడా అధికారులు గుర్తుచేశారు. ఈ కేసులోనూ దర్యాప్తు కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం హబీబ్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నామని, వారి కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. 
Javed Habib
Javed Habib fraud
hair stylist
Uttar Pradesh police
Follicle Global Company
cryptocurrency scam
financial fraud
India news
celebrity news

More Telugu News