Sreeleela: రాబోయే రోజులకు రాణులు ఈ భామలే!

Heroines Special
  • గ్లామర్ పరంగా మెప్పిస్తున్న భాగ్యశ్రీ 
  • ఇంతవరకూ దక్కని హిట్ 
  • 'మిరాయ్'లో మెరిసిన రితికా 
  • క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న బ్యూటీ 
  • చేతిలో మంచి ప్రాజెక్టులున్న భామలు 

ఈ మధ్య కాలంలో చాలా ఫాస్టుగా స్టార్ హీరోలతో సినిమాలను చుట్టబెట్టేసినవారిలో శ్రీలీల ముందు వరుసలో కనిపిస్తుంది. హిట్ లతో పాటు ఫ్లాపులు పలకరించినప్పటికీ, పరిగెత్తడంలో తనదైన స్పీడ్ చూపిస్తూనే ఉంది. శ్రీలీల స్థాయిలో మిగతా హీరోయిన్స్ ఎవరైనా ప్రభావితం చేయగలుతున్నారా? అనే ఆలోచన చేస్తే ఎవరూ కనిపించడం లేదు కూడా. కానీ ఇటీవల కాలంలో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు హీరోయిన్స్ మాత్రం ఈ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరు భాగ్యశ్రీ బోర్సే అయితే మరొకరు రితికా నాయక్. భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే అందచందాలు పుష్కలంగా ఉన్న అమ్మయేనని చెప్పాలి. తనలో తళుక్కున మెరిసే కళ్లు .. చురుక్కుమనే చూపులు .. మేనిఛాయ .. పాలరాతి శిల్పం వంటి రూపం .. ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. ఇంతవరకూ ఆమెకి పెద్దగా హిట్లు పడింది లేదు. కానీ త్వరలో విడుదల కానున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' .. 'కాంత'పై అంచనాలు ఉన్నాయి. రామ్ జోడీగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' .. దుల్కర్ సరసన 'కాంత' సక్సెస్ వైపు నుంచి ఆమె కెరియర్ ను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రితికా నాయక్ విషయానికి వస్తే, లుక్స్ పరంగా తను 'అశోకవనంలో అర్జున కల్యాణం'తోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత తొందర పడకుండా చేసిన 'మిరాయ్'తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. టైట్ క్లోజప్ లో సైతం ఆమె ఫ్రెష్ ఫేస్ యూత్ ను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ - మేర్లపాక గాంధీ కాంబినేషన్ లోను, ఆనంద్ దేవరకొండ జోడీగా చేస్తున్న 'డ్యూయెట్' సినిమాలపై ఆమె మరిన్ని ఆశలు పెట్టుకుంది. ఇలా ఈ బ్యూటీలు చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే, ఈ ఇద్దరి హవా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి.
Sreeleela
Bhagyashri Borse
Rithika Nayak
Andhra King Taluka
Kanta movie
Mirai movie
Telugu cinema
Tollywood
actresses
Varun Tej

More Telugu News