Kodali Srinivasarao: నకిలీ మద్యం కేసు... కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్

Kodali Srinivasarao Arrested in Fake Liquor Case
  • మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక అరెస్ట్
  • తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్
  • మద్యం తయారీ షెడ్డును లీజుకు తీసుకున్న నిందితుడు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావును ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 12వ నిందితుడిగా (A12) ఉన్న శ్రీనివాసరావు, కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన షెడ్డును తన పేరు మీద లీజుకు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

కొంతకాలంగా తెనాలిలోని ఐతానగర్‌ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో నివసిస్తున్న శ్రీనివాసరావు కోసం ఎక్సైజ్ అధికారులు గాలింపు చేపట్టారు. అయితే, అధికారుల రాకను పసిగట్టిన ఆయన అప్పటికే పరారయ్యారు. దీంతో, ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు, తప్పించుకు తిరుగుతున్న శ్రీనివాసరావును తెనాలిలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

స్థానిక సమాచారం ప్రకారం, కొడాలి శ్రీనివాసరావు తెనాలిలో వైసీపీలో క్రియాశీలక నేతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, 2024 సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కేసులో రాజకీయ కోణాన్ని తెరపైకి తెచ్చింది.

అరెస్ట్ అనంతరం అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినప్పటికీ, కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిసింది. శ్రీనివాసరావు అరెస్ట్‌తో ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న మరిన్ని సంచలన విషయాలు, కీలక వ్యక్తుల ప్రమేయం బయటకు వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. 
Kodali Srinivasarao
Molkala cheruvu fake liquor case
AP fake liquor case
Tenali YCP leader
Excise Enforcement
Andhra Pradesh crime
YSRCP
Fake liquor manufacturing
Political angle
AP Elections 2024

More Telugu News