Diwali: భారతీయ పండుగ దీపావళి .. కీలక ప్రకటన చేసిన కాలిఫోర్నియా

California declares Diwali as official holiday
  • దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించిన కాలిఫోర్నియా
  • తాజాగా ప్రకటన జారీ చేసిన గవర్నర్ న్యూసమ్
  • లక్షలాది భారతీయ అమెరికన్లకు ఇది గౌరవ సూచకమైన నిర్ణయం అవుతుందన్న అసెంబ్లీ సభ్యుడు అష్ కల్రా
భారతీయ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దీపావళికి అంతర్జాతీయంగా మరో విశిష్ట గౌరవం లభించింది. ఈ పండుగ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందింది.

దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దీనిని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

గతంలో అమెరికా కాంగ్రెస్‌లో దీపావళిని సెలవు దినంగా గుర్తించాలని బిల్లు ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఆ ప్రక్రియ కొనసాగింపుగా, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్ న్యూసమ్ సంతకం చేశారు.

భారతీయ అమెరికన్లకు గుర్తింపు

ఈ బిల్లును అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టారు. దీపావళి పండుగను అధికారిక సెలవుగా ప్రకటించడం ద్వారా కాలిఫోర్నియాలో నివసిస్తున్న లక్షలాది భారతీయ అమెరికన్లకు ఇది గౌరవ సూచకమని ఆయన అన్నారు. ఈ పండుగ సద్భావన, శాంతి, సమైక్యత అనే విలువల సందేశంతో సమాజాన్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అమల్లో

కాలిఫోర్నియా కంటే ముందు పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాలు దీపావళిని అధికారిక సెలవుగా గుర్తించాయి. ఈ నేపథ్యంలో భారతీయుల పండుగకు గుర్తింపు ఇచ్చిన మూడవ అమెరికన్ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. 
Diwali
California
Diwali holiday
Gavin Newsom
Ash Kalra
Indian Americans
Pennsylvania
New York
Festival of Lights

More Telugu News