Himachal Pradesh Landslide: హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. బస్సుపై విరిగిపడిన కొండచరియలు.. 18 మంది మృతి

Himachal Pradesh Landslide Kills 15 Tourists in Bus Accident
  • హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ప్రమాదం
  • ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ టూరిస్టు బస్సు ధ్వంసమై 18 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు.

హర్యానాలోని రోహ్‌తక్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ఘుమర్విన్‌కు ప్రైవేటు బస్సు బయలుదేరింది. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Himachal Pradesh Landslide
Himachal Pradesh
Bilaspur
Ghumarwin
Road accident
Bus accident

More Telugu News