MS Dhoni: ధోనీ మా వద్ద శిక్షణ తీసుకుని డ్రోన్ పైలట్ లైసెన్స్ సాధించాడు: గరుడ ఏరోస్పేస్ వెల్లడి

MS Dhoni certified as drone pilot by Garuda Aerospace
  • ఇప్పుడు ధోనీ సర్టిఫైడ్ డ్రోన్ పైలట్‌గా గుర్తింపు సాధించాడని వెల్లడి
  • ధోనీ చాలా త్వరగా డ్రోన్ ఎగురవేయడం నేర్చుకున్నాడన్న ఏరో స్పేస్ వెల్లడి
  • డ్రోన్ పరిశ్రమలో తమకు ధోనీ కీలకం కానున్నాడన్న గరుడ ఏరో స్పేస్
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సర్టిఫైడ్ డ్రోన్ పైలట్‌గా గుర్తింపు పొందాడు. ఈ విషయాన్ని గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. తమ సంస్థ నుంచి ధోనీ ఈ డ్రోన్ పైలట్ లైసెన్స్ సాధించినట్లు తెలిపింది. "డీజీసీఏ ఆమోదం పొందిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్పీటీవో) గరుడ ఏరో స్పేస్ నుండి ఎంఎస్ ధోనీ ఇప్పుడు సర్టిఫైడ్ డ్రోన్ పైలట్" అని పేర్కొంది.

డ్రోన్ల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ సంస్థకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అదే సంస్థ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందాడు. ఇటీవలే చెన్నైలోని కంపెనీ డీజీసీఏ ఆమోదం పొందిన రిమోట్ కంట్రోల్ శిక్షణ కేంద్రంలో పాల్గొన్న ధోనీ తన నైపుణ్యాలను ప్రదర్శించి లైసెన్స్ అందుకున్నాడు.

గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచారకర్త, పెట్టుబడిదారుగా ఉన్న ధోనీ శిక్షణ పూర్తి చేసుకుని డ్రోన్ పైలెట్ లైసెన్స్ సాధించాడని, అతడు చాలా త్వరగా డ్రోన్ ఎగురవేయడం నేర్చుకున్నాడని గరుడ ఏరో స్పేస్ తెలిపింది. డ్రోన్ పరిశ్రమలో విస్తరించాలనుకుంటున్న తమ జట్టుకు ధోనీ కీలకం కానున్నాడని పేర్కొంది. అలాంటి లెజెండ్స్‌ను దేశం అనుసరిస్తుందని అభిప్రాయపడింది. ఇదివరకే 2,500 మంది ఔత్సాహిక యువతకు డ్రోన్ పైలటింగ్‌లో శిక్షణ ఇచ్చామని తెలిపింది.
MS Dhoni
Mahendra Singh Dhoni
Dhoni drone pilot
Garuda Aerospace
drone pilot license
DGCA

More Telugu News