ఏడేళ్ల నాటి జొమాటో బిల్ ఫొటో వైరల్.. కారణం ఇదే!
- అప్పట్లో డిస్కౌంట్లతో బిల్లు తగ్గేదంటున్న నెటిజన్లు
- ఇప్పుడు డిస్కౌంట్ల పేరుతో కంపెనీ గిమ్మిక్కులు చేస్తోందని విమర్శ
- రేట్ల పెంపునకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమూ ఓ కారణమేనంటున్న యూజర్లు
కూపన్ డిస్కౌంట్ తో అప్పట్లో బిల్ తగ్గేదని, ఇప్పుడు మాత్రం పేరుకు డిస్కౌంట్ ఇస్తున్నా బిల్ మాత్రం తగ్గడంలేదని ఆరోపించారు. అప్పట్లో రూ.92 లకు వచ్చిన పన్నీర్ టిక్కా ఇప్పుడు రూ.300 ల కంటే తక్కువకు రావడంలేదని వాపోయారు. డెలివరీ ఛార్జీ, డైనమిక్ ఛార్జీ, రెయిన్ ఫీ, రెస్టారెంట్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయని ఫుడ్ డెలివరీ యాప్ లపై మండిపడ్డారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. అప్పటికి, ఇప్పటికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆహార పదార్థాల రేట్లు పెరగడానికి ఓ కారణమని కామెంట్లు పెడుతున్నారు. 2019లో అమూల్ నెయ్యి 15 కిలోల టిన్ రూ.5,500 లకే లభించేదని, ఇప్పుడు అదే టిన్ రూ.9 వేలకు చేరిందని మరొక యూజర్ పేర్కొన్నారు. ధరలు పెరగడం వల్ల రేట్లు కూడా పెరిగాయని ఆయన అన్నారు.