Bhumana Karunakar Reddy: ఆ లెక్కలన్నీ బయటపెడతాం: భూమనకు భానుప్రకాశ్ రెడ్డి వార్నింగ్

Bhanu Prakash Reddy Warns Bhumana Exposing TTD Irregularities
  • భూమన హయాంలో జరిగిన అవకతవకలను బయటపెడతామన్న భానుప్రకాశ్ రెడ్డి
  • స్వామివారి శేషవస్త్రం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్న 
  • శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపాటు
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రస్తుత టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూమన హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన లెక్కలన్నీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. శ్రీవారి ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దిగజార్చేలా భూమన కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదని అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామిపై తప్పులు వెతకడం సరైన పద్ధతి కాదని భానుప్రకాశ్ రెడ్డి హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా భూమన లెక్కలేనన్ని పనులు చేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రశ్నలను సంధించారు. నిబంధనల ప్రకారం రంగనాయకుల మండపంలో జరగాల్సిన పరివట్టాన్ని వెంకయ్య చౌదరి నివాసంలో ఎందుకు నిర్వహించారో భూమన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఆయన హయాంలో స్వామివారి శేషవస్త్రం ఎవరెవరికి చేరిందో, ఆలయం నుంచి ఎలా బయటకు వెళ్లిందో తమ వద్ద సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. 
Bhumana Karunakar Reddy
TTD
Bhanu Prakash Reddy
Tirumala
YSRCP
TTD Board Member
Sri Venkateswara Swamy
Ranganayakula Mandapam
Venkayya Choudary
Sesha Vastram

More Telugu News