Donald Trump: టారిఫ్ ల పవర్ తోనే యుద్ధాలను ఆపా: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Trump Says US Tariffs Averted Global Conflicts
  • ఆ అధికారమే లేకుంటే ఇప్పుడు కనీసం నాలుగు యుద్ధాలు జరుగుతుండేవన్న ట్రంప్ 
  • శాంతి నెలకొల్పడంతో పాటు భారీగా ఆదాయం కూడా పొందామన్న అమెరికా అధ్యక్షుడు
  • ఇండియా పాకిస్థాన్ యుద్ధం తానే ఆపానని మరోమారు వ్యాఖ్య
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉన్న టారిఫ్ లు విధించే శక్తితోనే ప్రపంచ యుద్ధాలను ఆపగలిగానని పేర్కొన్నారు. ఆ శక్తే కనుక లేకుంటే ప్రస్తుతం ప్రపంచంలో కనీసం నాలుగు దేశాల మధ్య భీకర యుద్ధాలు జరుగుతుండేవని వివరించారు. వివిధ దేశాలపై టారిఫ్ లు విధించడం ద్వారా ప్రపంచంలో శాంతి నెలకొల్పడంతో పాటు అమెరికాకు భారీ మొత్తంలో డబ్బు సమకూరుతోందని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోమారు వ్యాఖ్యానించారు. టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించడం ద్వారా, వ్యాపార ఒప్పందాల పేరుతో బెదిరించి రెండు దేశాలను యుద్ధ విరమణకు ఒప్పించినట్లు చెప్పారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్ మధ్య యుద్ధం మొదలయ్యాక కనీసం ఏడు ఫైటర్ జెట్లు కూలిపోయాయని ట్రంప్ చెప్పారు. దీంతో తాను కల్పించుకుని రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశానన్నారు. అయితే, యుద్ధం విరమించేందుకు భారత్, పాక్ లను ఏమని బెదిరించారనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు.
Donald Trump
United States
Tariffs
India Pakistan War
Trade Deals
White House
World Peace
Nuclear Weapons

More Telugu News