Droupadi Murmu: ఇద్దరు ఏపీ యువకులకు ఎన్ఎస్ఎస్ అవార్డులు

Droupadi Murmu Presents NSS Awards to Two AP Youths
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల స్వీకారం
  • అవార్డు అందుకున్న నెల్లూరు యువకులు పృథ్వీరాజ్, డి జిష్ణురెడ్డి
  • లక్ష చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేసిన రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువ ప్రతిభావంతులు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) అవార్డును గెలుచుకుని రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 2022–23 సంవత్సరానికి సంబంధించిన ‘మై భారత్ – ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులు’ అందుకున్నారు.

అవార్డు పొందినవారు:

ఎం. పృథ్వీరాజ్ – నెల్లూరులోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడు.

డి. జిష్ణురెడ్డి – నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడు.

ఈ ఇద్దరు యువకులు సామాజిక సేవ, ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా సేవలందించారు. వీరి సేవా దృక్పథాన్ని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేశారు. వీరికి రాష్ట్రపతి ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేశారు. 
Droupadi Murmu
Andhra Pradesh
NSS Award
National Service Scheme
M Prudhviraj
D Jishnu Reddy
Vikram Simhapuri University
Narayana Dental College
social service
youth awards

More Telugu News