Rohit Sharma: వాళ్లిద్దరూ వచ్చే వరల్డ్ కప్ ఆడాలంటే ఇదొక్కటే మార్గం: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Says This Is The Only Way Rohit Sharma Virat Kohli Can Play World Cup
  • రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్న ఇర్ఫాన్ పఠాన్
  • వీరు గొప్ప ఆటగాళ్లే కానీ మ్యాచ్ టచ్ అవసరమన్న ఇర్ఫాన్
  • నిరంతరంగా మ్యాచ్‌లు ఆడితేనే ఆటతీరును మెరుగుపర్చుకోవచ్చని వ్యాఖ్య
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే విషయంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ 20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో వీరు 2027 ఆడాలనుకుంటే, మ్యాచ్ ప్రాక్టీస్‌ అనే అంశం ప్రధాన సవాలుగా మారుతుందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును అధిగమించాలంటే, రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందని సూచించాడు.

“వారు గొప్ప ఆటగాళ్లు కానీ మ్యాచ్ టచ్ అవసరం”

ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. “రోహిత్ తన ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ చూపించాడు. కానీ రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే, ఆటలో ఉండే మ్యాచ్ టచ్ కోల్పోతారు. వారు టీ20లు ఆడటం లేదు, టెస్టులకు కూడా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఎక్కువ వన్డేలు ఆడదు. టోర్నీకి ముందు సరైన ప్రాక్టీస్ లేకపోతే అది వారి ప్రదర్శనపై ప్రభావం చూపవచ్చు,” అని పఠాన్ అన్నారు.

ఫిట్‌నెస్ సరిపోదు – క్రమం తప్పని మ్యాచ్‌లు అవసరం

ఇర్ఫాన్ తన వ్యాఖ్యల్లో, “ఫిట్‌నెస్ ఒక్కటే సరిపోదు. నిరంతరంగా మ్యాచ్‌లు ఆడితేనే ఆటతీరును మెరుగుపర్చుకోవచ్చు. ఆ విషయంలో దేశవాళీ టోర్నీలు చాలా ఉపయోగపడతాయి. 2027 వరల్డ్ కప్‌లో ఆడాలన్న లక్ష్యంతో ఉన్న రోహిత్, కోహ్లీ ఇప్పటి నుంచే తగిన సన్నాహాలు మొదలు పెట్టాలి,” అని అభిప్రాయపడ్డాడు.

మళ్లీ మైదానంలోకి రానున్న రోహిత్-కోహ్లీ

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్, విరాట్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా, త్వరలో మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు వీరిద్దరినీ ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. 
Rohit Sharma
Virat Kohli
Irfan Pathan
ODI World Cup 2027
India Cricket
Domestic Cricket
Match Practice
Shubman Gill
Australia ODI Series
Cricket Fitness

More Telugu News