Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. స్పందించిన పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar Reacts to Supreme Court Dismissing BC Reservation Petition
  • బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న మంత్రి
  • అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించుకుని ముందుకు వెళుతున్నామని వ్యాఖ్య
  • బీజేపీ అన్ని రిజర్వేషన్లకు వ్యతిరేకమని విమర్శ
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించుకుని ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు.

బీజేపీ అన్ని రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై చట్ట సవరణ బిల్లు, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటున్నది బీజేపీ నేతలేనని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, ఇప్పుడు ఆ పార్టీ నేతలు మాట మారుస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులను ఆమోదింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఒక ఫ్యూడలిస్టు పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు గతంలో హెచ్‌సీయూలో ఎస్సీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు న్యాయ ప్రక్రియలోనూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Ponnam Prabhakar
BC Reservations
Telangana
Supreme Court
BJP
Reservation Bill
Ramachander Rao

More Telugu News