ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్!

Tribanadhari Barbarak Movie Update
  • సత్యరాజ్ నాయకుడిగా 'త్రిబాణధారి బార్బరీక్'
  • సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ 
  • ఆగస్టులో విడుదలైన సినిమా
  • ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో టైటిల్ విషయంలోనే ఆడియన్స్ ను ఆలోచనలో పడేసిన సినిమాగా 'త్రిబాణధారి బార్బరిక్' కనిపిస్తుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీన విడుదలైంది. ఓ మాదిరి ప్రమోషన్స్ తోనే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా విడుదలైన విషయం చాలామందికి తెలియదుగానీ, అసహనంతో దర్శకుడు చేసిన పనితో టైటిల్ అందరిలోకి వెళ్లింది. 

సత్యరాజ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఉదయభాను .. సత్యం రాజేశ్ .. వశిష్ఠ ఎన్ సింహా .. సాంచీ రాయ్ వీటీవీ గణేశ్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమా ఇప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 

కథ విషయానికి వస్తే, శ్యామ్ ఓ సైకియాట్రిస్ట్. ఆయన కొడుకు .. కోడలు చనిపోతారు. మనవరాలైన 'నిధి' కోసం అతను బ్రతుకుతుంటాడు. ఆ పాపను అతను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజున ఆ పాప కనిపించకుండా పోతుంది. దాంతో శ్యామ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలుపెట్టిన పోలీసులకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.

Go Back to Shorts
Tribanadhari Barbarik
Mohan Srivatsa
Satya Raj
Sun NXT
Telugu movies
Tamil movies
OTT releases
Psychological thriller
Udayabhanu
Satyam Rajesh

More Telugu News