Indian Army: ఐటీఐ అర్హతతో ఆర్మీ ఉద్యోగం.. నోటిఫికేషన్ వివరాలు ఇవిగో!

Indian Army Job Notification for ITI Graduates
ఐటీఐ పూర్తిచేసిన నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. ఆర్మీలో 194 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ ఇంజినీర్స్ ( ఇండియన్ ఆర్మీ డీజీ ఈఎంఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, ఫైర్మెన్, ఇతర పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

అక్టోబర్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాత పరీక్ష, స్కిల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు indianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.

పోస్టులు: 194
అర్హతలు: పదో తరగతి, ఇంటర్ లేదా సమాన అర్హతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాలు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Indian Army
Army recruitment
ITI jobs
Indian Army jobs
LDC posts
Fireman jobs
EME recruitment
Defense jobs
Government jobs
Indian Army notification

More Telugu News