Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో నాలుగో వికెట్ డౌన్.. ఈసారి ఇంటికెళ్లింది అతనే!

Haritha Harish Eliminated from Bigg Boss Telugu 9 Week 4
  • బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి నాలుగో కంటెస్టెంట్ ఎలిమినేట్
  • ఈ వారం హౌస్ వీడిన హరిత హరీశ్
  • ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్ ప్రక్రియ
  • చివరి రౌండ్‌లో దివ్య, హరీష్ మధ్య హోరాహోరీ
  • ఇప్పటివరకు హౌస్ నుంచి ముగ్గురు కామనర్లు ఔట్
  • ఆరుగురు నామినేట్ కాగా ఐదుగురు సేవ్
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-9లో నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి కామనర్ కేటగిరీకి చెందిన హరిత హరీష్ బయటకు వచ్చేశారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో చివరి వరకు సస్పెన్స్ నడిపిన తర్వాత హరీశ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

గత వారం నామినేషన్లలో ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన, శ్రీజ, దివ్య, హరీశ్ సహా మొత్తం ఆరుగురు సభ్యులు నిలిచారు. వీరిలో రీతూ చౌదరిని శనివారం ఎపిసోడ్‌లోనే నాగార్జున సేవ్ చేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్ ఆరంభంలో ఫ్లోరా, సంజన, శ్రీజ సేఫ్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించడంతో ఎలిమినేషన్ గండం దివ్య, హరీశ్‌ల మధ్యకు చేరింది.

ఆసక్తికరంగా ఎలిమినేషన్ ప్రక్రియ  
చివరి ఇద్దరి ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున ఆసక్తికరంగా నిర్వహించారు. "మీ ఇద్దరూ యాక్టివిటీ రూమ్‌కి వెళ్లండి. అక్కడ ఉన్న గ్లౌజ్‌లు వేసుకుని, కౌంట్‌డౌన్ తర్వాత వెనకున్న స్క్వేర్స్‌ను బద్దలుకొట్టండి. అందులో మీ ఫొటోతో పాటు సేఫ్ లేదా అన్‌సేఫ్ అనే విషయం స్పష్టంగా ఉంటుంది" అని నాగార్జున సూచించారు. ఆయన చెప్పినట్లే ఇద్దరూ ఒకేసారి బాక్సులను పగలగొట్టారు. ఇందులో దివ్య సేఫ్ కాగా, హరీశ్ ఎలిమినేట్ అయినట్లు తేలింది. దీంతో హరీశ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడి స్టేజ్ మీదకు వచ్చారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీశ్, ప్రియ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా హరీశ్ నిష్క్రమణతో హౌస్ నుంచి బయటకు వచ్చిన మూడో కామనర్ అతడే కావడం గమనార్హం.
Bigg Boss Telugu 9
Haritha Harish
Bigg Boss 9
Haritha Hareesh
Nagarjuna
elimination
Telugu reality show
Flora Saini
Divya

More Telugu News